IND vs AUS: వన్డే ఓటమి తర్వాత ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సిరీస్ కు భారత్ సిద్ధమైంది. అంచనాలను అందుకోలేక ఆస్ట్రేలియాకు సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు టీ20 గెలుపుతో బదులిచ్చేందుకు రెడీ అయ్యింది. కాన్ బెర్రా వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1.45 నుంచి మ్యాచ్ జరగనుంది. వన్డేలను పేలవంగా ఆరంభించినప్పటికీ, ఘనవిజయంతో ముగించిన భారత్.. పొట్టి క్రికెట్లో ఆతిథ్య జట్టుకు దీటుగానే స్పందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవలే ఆసియా కప్ గెలిచిన ఊపులో జట్టు ఉండడం.. జట్టు కూడా మెరుగ్గా కనిపిస్తుండడంతో సిరీస్ గెలవడానికి భారత్‌కు మెరుగైన అవకాశాలే ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతుండడంతో పోరుహోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also: Bigg Boss Trolls: నీ మొహం చూస్తేనే చిరాకు.. నీ వీడియోస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
త్వరలోనే టీ20 ప్రపంచ కప్..
ఇంకో నాలుగు నెలల్లో సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ జరగబోతుండగా.. ఆ మెగా టోర్నీ దిశగా కీలక సిరీస్‌కు సిద్ధమైంది టీమ్‌ఇండియా. ప్రపంచ మేటి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై 5 టీ20ల సిరీస్‌లో భారత్ ఢీకొనబోతోంది. వన్డే సిరీస్‌లో భారత్ ఓడినప్పటికీ.. టీ20ల్లో మాత్రం భిన్నమైన ఫలితం రాబట్టగలదనే అంచనాలున్నాయి. అన్ని విభాగాల్లో జట్టు బలంగా కనిపిస్తుండడమే అందుక్కారణం. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత టీ20 జట్టు చివరగా ఆసియా కప్‌లో చక్కటి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచింది. ఆ టోర్నీలో చెలరేగిపోయిన అభిషేక్ శర్మ.. ఆస్ట్రేలియాలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించే అభిషేక్.. పేస్‌కు సహకరించే కాన్‌బెర్రా పిచ్‌పై ఎలా ఆడుతాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆసియా కప్ ఫైనల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ మీదా మంచి అంచనాలున్నాయి. టెస్టుల్లో అదరగొడుతున్నప్పటికీ టీ20లు, వన్డేల్లో నిరాశపరుస్తున్న శుభ్‌మన్ గిల్.. ఈ సిరీస్‌లో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి.
Read Also: Women’s World Cup: ప్రపంచ కప్ లో కీలక పోరు.. ఇంగ్లాండ్- సౌతాఫ్రికా మధ్య తొలి సెమీఫైనల్
సూర్య సారథ్యంలో..
సూర్య సారథ్యంలోని జట్టు నిలకడగా విజయాలు సాధిస్తున్నప్పటికీ.. అతడి వ్యక్తిగత ఫామ్ మాత్రం కలవరపరుస్తోంది. ఆసియా కప్‌లో అతను 7 మ్యాచ్‌ల్లో 72 పరుగులే చేశాడు. సూర్య మునుపటిలా చెలరేగకపోతే కెప్టెన్‌గా తనను తప్పించాలన్న డిమాండ్లు వస్తాయి. హార్దిక్ పాండ్య గాయపడ్డ నేపథ్యంలో సంజు శాంసన్, శివమ్ దూబె, అక్షర్ పటేల్ మిడిలార్డర్లో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టీ20ల్లో ఆడబోతుండడం భారత్‌కు సానుకూలాంశం. చివరగా ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను గొప్ప ప్రదర్శన చేశాడు. తన బౌలింగ్‌కు బాగా నప్పే పిచ్‌పై బుమ్రా విజృంభిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అర్ష్‌దీప్ అతడితో కొత్త బంతిని పంచుకోనున్నాడు. హర్షిత్ రాణా మూడో పేసర్‌గా బరిలోకి దిగే అవకాశముంది. అక్షర్‌కు తోడుగా వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్‌ల్లో ఒకరు తుది జట్టులో ఉంటారు.


