Saturday, November 15, 2025
HomeఆటIndia vs Australia: ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరిన టీమ్ ఇండియా.. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా రోకో..

India vs Australia: ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరిన టీమ్ ఇండియా.. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా రోకో..

India vs Australia 1st ODI: టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది. అక్కడ భారత్ మూడు వన్డేలు మరియు ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా స్టార్ ఫ్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. వన్డే టీమ్ కు శుభ్‌మాన్ గిల్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. టీమ్ ఇండియా ప్లేయర్లు ఆస్ట్రేలియాకు వెళ్తూ ఢిల్లీ ఎయిర్ ఫోర్టులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కెప్టెన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, హార్షిత్ రానా, కేఎల్ రాహుల్, ఆర్షదీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ద్ కృష్ణ కనిపించారు. రోహిత్, కోహ్లీ కలిసి చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. ఫైనల్లో 83 బంతుల్లో 76 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు రోహిత్.

- Advertisement -

ఈనెల 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే ఆదివారం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. ఈ వన్డే ఉదయం 9 గంటలకు స్టార్ట్ కానుంది. ఈ మ్యాచులు స్టార్ స్పోర్ట్స్ మరియు జియో హాట్ స్టార్ యాప్ లో ప్రసారం కానున్నాయి. ఈ మ్యాచులను డీడీ స్పోర్ట్స్ లో కూడా చూడొచ్చు. రెండు, మూడు వన్డేలు అక్టోబర్ 23 మరియు 25 తేదీలలో జరగనున్నాయి. అక్టోబర్ 29 నుండి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ కొనసాగనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్న 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ముందు ఈ సిరీస్ సన్నాహాకంగా ఉంటుంది.

Also Read: IND vs WI Highlights -ఢిల్లీ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ 2-0తో కైవసం..

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, మరియు ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కోనోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad