Saturday, November 15, 2025
HomeTop StoriesIND vs AUS Live: నేడే భారత్-ఆసీస్ మూడో టీ20.. బరిలోకి దిగబోతున్న టీమ్...

IND vs AUS Live: నేడే భారత్-ఆసీస్ మూడో టీ20.. బరిలోకి దిగబోతున్న టీమ్ ఇండియా డేంజరస్ బౌలర్!

- Advertisement -

India vs Australia Live Streaming, 3rd T20I: మరికొన్ని గంటల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కు హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో ఆసీస్ 1-0తో లీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని సూర్య సేనా భావిస్తోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనిని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తోపాటు జియోహాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు.

త్వరలో యాషెస్ సిరీస్ ఉండటంతో స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌కు ఆస్ట్రేలియా జట్టు విశ్రాంతినిచ్చింది. ఇది భారత్ కు శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే గత మ్యాచ్ లో టీమిండియాను దెబ్బతిసింది అతడే. రెండో టీ20లో సూర్య, తిలక్, గిల్ వంటి బ్యాటర్ల వికెట్లను తీశాడు. తొలి రెండు మ్యాచులకు పక్కన పెట్టిన అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ ద్వారా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. షార్ట్ బౌండరీలు ఉండటంతో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి హిట్టర్లకు పండగే అని చెప్పాలి. కంగూరు జట్టులోద కూడా ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. టీ20ల్లో భారత్, ఆస్ట్రేలియాలు ఇప్పటి వరకు 35 మ్యాచుల్లో తలపడగా.. భారత్ 20, ఆసీస్ 12 మ్యాచుల్లో గెలిచాయి. రెండు మ్యాచుల్లో ఫలితం రాలేదు.

Also Read: IND-W vs SA-W Final – మరికొన్ని గంటల్లో భారత్-దక్షిణాఫ్రికా చారిత్రాత్మక ఫైనల్‌.. ఫ్లేయింగ్ XI ఇదే..!

ఇరు జట్లు:

భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్

ఆస్ట్రేలియా జట్టు

మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, మహలి బియర్డ్‌మాన్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad