AUS vs IND: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో (Border – Gavaskar Trophy 2024) భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ 8/0 వద్ద ఉన్న దశలో మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 260 పరుగులే చేసింది. దీంతో ఆసీస్‌కు 185 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఆసీస్ 89/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసి టీమిండియాకు 275 పరుగుల టార్గెట్ ఇచ్చింది. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. నాలుగో టెస్టు మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది.