Saturday, November 15, 2025
HomeTop StoriesINDW vs AUSW: టాస్‌ గెలిచిన ఆసీస్‌.. భారత్‌ ఫస్ట్ బౌలింగ్

INDW vs AUSW: టాస్‌ గెలిచిన ఆసీస్‌.. భారత్‌ ఫస్ట్ బౌలింగ్

INDW vs AUSW: భారత్‌ – ఆస్ట్రేలియా మహిళల మధ్య సెమీఫైనల్‌ పోరు ఆసక్తికరంగా ప్రారంభమైంది. టాస్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. క్రీజులోకి ఓపెనర్లు అలీసా హీలీ, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ వచ్చారు. స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. రెండు జట్ల అభిమానులు కూడా సమాన ఉత్సాహంతో తమ జట్లకు మద్దతు తెలుపుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్‌లో స్థానం ఖాయం కానుండటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

- Advertisement -

టాస్‌ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్‌ అలీసా హీలీ మాట్లాడుతూ, “ఇక్కడ పిచ్‌ పరిస్థితులు చాలా బాగున్నాయి. పెద్ద స్కోరు చేయడానికి అవకాశముంది. ఇది సెమీఫైనల్‌ పోరు. ఎవరు బాగా ఆడతారో వారే ఫలితం పొందుతారు. మా జట్టులో ఒక్క మార్పు మాత్రమే ఉంది. వేర్‌హామ్‌ స్థానంలో సోఫీ మోలనూ జట్టులోకి వచ్చింది” అని తెలిపారు.

భారత్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ, “మేం కూడా మొదట బ్యాటింగ్‌ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు బౌలింగ్‌ చేస్తున్నాం. తొందరగా వికెట్లు తీస్తే మాకు అది మేలు చేస్తుంది. ఈ పిచ్‌ గురించి మాకు అవగాహన ఉంది, ఎందుకంటే గత రెండు మ్యాచ్‌లు కూడా ఇక్కడే ఆడాం. ఈ రోజు ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దురదృష్టవశాత్తూ గాయపడటం వల్ల ప్రతీక రావల్‌ ఈ మ్యాచ్‌లో ఆడలేకపోతోంది. క్రాంతి గౌడ్‌ జట్టులోకి వచ్చింది. హర్లీన్‌, ఉమలకు విశ్రాంతినిచ్చాం. రిచా ఘోష్‌, షఫాలీ తుదిజట్టులో చోటు సంపాదించారు” అని తెలిపారు.

భారత్‌ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్‌, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్‌, రాధ యాదవ్‌, క్రాంతి గౌడ్‌, శ్రీ చరణి, రేణుక సింగ్‌ తుదిజట్టులో ఉన్నారు.

ఆస్ట్రేలియా జట్టులో అలీసా హీలీ (కెప్టెన్‌), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, ఎలీస్‌ పెర్రీ, బెత్‌ మూనీ, అనాబెల్‌ సదర్లాండ్‌, ఆష్లీ గార్డ్‌నర్‌, తాలియా మెక్‌గ్రాత్‌, సోఫీ మోలనూ, అలానా కింగ్‌, కిమ్‌ గార్త్‌, మెగాన్‌ షట్‌ ఉన్నారు.

ప్రస్తుతం మ్యాచ్‌ ప్రారంభమై, ఆసీస్‌ ఓపెనర్లు హీలీ, లిచ్‌ఫీల్డ్‌ క్రీజులో ఉన్నారు. రెండు జట్లు సమానంగా దూకుడుతో ఆడేందుకు సిద్ధమయ్యాయి. అభిమానులు ఆసక్తిగా ఈ పోరును వీక్షిస్తున్నారు. భారత బౌలర్లు తొలి వికెట్‌ కోసం ప్రయత్నిస్తుండగా, ఆస్ట్రేలియా ఓపెనర్లు పటిష్ట ఆరంభం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెమీఫైనల్‌ ఉత్కంఠ ఉప్పొంగిస్తున్న ఈ పోరులో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad