Friday, November 22, 2024
HomeఆటIND vs NZ : టైగా ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌.. భార‌త్‌దే సిరీస్‌

IND vs NZ : టైగా ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌.. భార‌త్‌దే సిరీస్‌

IND vs NZ : నేపియ‌ర్‌లోని మెక్‌లీన్ పార్క్ వేదిక‌గా భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 160 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 161 ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 9 ఓవ‌ర్లు ముగిసేస‌రికి నాలుగు వికెట్లు కోల్పోయి 75 ప‌రుగులు చేసింది. ఈ ద‌శ‌లో వ‌రుణుడు ఆటంకం క‌లిగించాడు. భారీ వ‌ర్షం కురవ‌డంతో ఔట్ ఫీల్డ్ చిత్త‌గా మారింది. మైదానాన్ని ప‌రీక్షించిన అంఫైర్లు ఆట కొన‌సాగించ‌డానికి ఇష్ట ప‌డ‌లేదు. డ‌క్త్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం భార‌త్ 75 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా.. స‌రిగ్గా అన్నే ప‌రుగులు చేయ‌డంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా.. రెండో టీ20లో భార‌త్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా సిరాజ్‌, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గా సూర్య‌కుమార్ గా నిలిచారు.

- Advertisement -

161 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలోకి దిగిన భార‌త్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. ఇషాన్ కిష‌న్‌(10), పంత్‌(5), సూర్య‌కుమార్ యాద‌వ్(13) లు స్వ‌ల్ప స్కోర్ల‌కే వెనుదిర‌గ‌డంతో భార‌త్ 21 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య‌(30 నాటౌట్‌; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) దంచికొట్టాడు. అత‌డికి దీప‌క్ హుడా (9 బంతుల్లో 9 నాటౌట్ ) చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. అయితే.. తొమ్మిదో ఓవ‌ర్ పూర్తి కాగానే వ‌రుణుడు త‌న ఆట మొద‌లు పెట్టాడు.

అంత‌క‌ముందు న్యూజిలాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 160 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో కాన్వే(59; 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఫిలిప్స్‌(54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌లు చెరో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, హర్ష‌ల్ ప‌టేల్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News