IND vs NZ 1st T20 Prediction in Telugu: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (జనవరి 21) నాగ్‌పూర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగబోతుంది. వన్డే సిరీస్ కోల్పోయిన కసిలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 7 గంటలకు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (టీవీ), జియోహాట్‌స్టార్ (లైవ్ స్ట్రీమింగ్) ప్రసారం కానుంది.
బలాబలాలు
టీమ్ ఇండియా: భారత్ ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవలే సౌత్ ఆఫ్రికాను 3-1తో ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే, స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడం లోటే. అతని స్థానంలో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తిరిగి రావడంతో జట్టు మరింత బలోపేతంగా కనిపిస్తోంది. గణాంకాలు మరియు ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే, టీ20 ఫార్మాట్‌లో భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, కివీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం.
న్యూజిలాండ్: వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న కివీస్, అదే ఊపును టీ20ల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నేతృత్వంలో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర మరియు ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫ్ఫీ భారత్‌ను ఇబ్బంది పెట్టగలరు.
పిచ్ మరియు వాతావరణ రిపోర్టు
నాగ్‌పూర్ పిచ్ సాధారణంగా బౌలర్లు మరియు బ్యాటర్లకు సమానంగా సహకరిస్తుంది. ప్రారంభంలో పేసర్లకు స్వింగ్ లభిస్తుంది, అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించవచ్చు. వాతావరణం పొడిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు. ఉష్ణోగ్రత 25°C నుండి 30°C మధ్య ఉండే అవకాశం ఉంది.
Also Read: Viral Video-“ఎక్కడికి కొడతావ్?”.. గంభీర్ ప్రశ్నకు హార్దిక్ పాండ్యా అదిరే రిప్లై!
టాస్ అంచనా: ఈ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 13 మ్యాచ్‌లలో 9 సార్లు గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. టీ20ల్లో ఇరు జట్లు 25 మ్యాచుల్లో తలపడగా.. 14 మ్యాచుల్లో టీమ్ ఇండియా, పది మ్యాచుల్లో కివీస్ విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.
తుది జట్టు (అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
కివీస్: డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, బెవాన్ జాకబ్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, ఇష్ సోధి, మైఖేల్ బ్రేస్‌వెల్/గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జాక్ ఫౌల్క్స్/కైల్ జామిసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ

