Saturday, November 15, 2025
HomeఆటIndia Vs Pakistan: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ టికెట్లు షాక్.. రేట్లు తగ్గించినా అమ్ముడుపోలేదు!

India Vs Pakistan: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ టికెట్లు షాక్.. రేట్లు తగ్గించినా అమ్ముడుపోలేదు!

India Vs Pakistan: ఆసియా కప్ టోర్నెంట్ లో టీమిండియా అందరి ఫేవరేట్ గా మారింది. కాగా.. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌లో (Asia cup) భాగంగా టీమిండియా,  చిరకాల ప్రత్యర్థితో పోటీ పడనుంది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, పాక్ తలపడనున్నాయి. సాధారణంగా ఈ మ్యాచ్‌కు టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయేవి. అయితే ఈ సారి మాత్రం అలా జరగట్లేదు. అందుకు భిన్నంగా జరుగుతోంది. పహల్గాం దాడి నేపథ్యంలో.. భారత్, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని అభిమానులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. దీంతో టికెట్ల అమ్మకాలు తగ్గిపోయాయి. అలాగే అధిక ధరలు కూడా మరో కారణంగా నిలుస్తున్నాయి. అయితే ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల రేట్లను నిర్వాహకులు తగ్గించారు. అయినా పరిస్థితిలో ఏ మార్పూ రానట్లు తెలుస్తోంది. టికెట్ల అమ్మకాలు మాత్రం అంతంగానే ఉన్నాయి.

- Advertisement -

Read Also: Nepal Crisis: నేపాల్ తాత్కాలిక ప్రధానిపై వీడిన ఉత్కంఠ.. సుశీల కర్కేకే బాధ్యతల అప్పగింత

రేట్లను తగ్గించిన ఈసీబీ..

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌.. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించిన మ్యాచ్‌ సాధారణ టికెట్ల ధరను 475 దిర్హామ్స్‌ (దాదాపు రూ.11,420)గా పేర్కొంది. కాగా, వాటిని 350 దిర్హామ్స్‌కు (దాదాపు రూ.8415) తగ్గించింది.  అయితే ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డ్‌ (ECB) స్పందన మాత్రం భిన్నంగా ఉంది. టికెట్లు అమ్ముడు పోవడం లేదన్నది వాస్తవం కాదని ఈసీబీ ఖండిస్తోంది. ‘పరిస్థితులు చాలా ప్రోత్సాహకంగా ఉన్నాయి. టికెట్లు అమ్ముడు పోవడం లేదు అనే విషయంలో ఎలాంటి వాస్తవం లేదు’ అని వారు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. టికెట్లను అమ్మకానికి పెట్టి, దాదాపు పది రోజులు కావస్తోన్నా.. ఇంకా 50 శాతం టికెట్లు అమ్ముడు పోకుండా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌ , పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే అదీనూ తటస్థ వేదికల్లో మాత్రమే భారత్‌, పాక్‌ తలపడుతున్నాయి. ‘ఆసియా కప్.. ఆసియా ఖండంలోని దేశాలు పాల్గొనే మల్టీనేషనల్‌ టోర్నమెంట్ కాబట్టి, మనం ఇందులో పాల్గొనాల్సిందే. ఏదైనా ఐసీసీ (ICC) టోర్నమెంట్‌లో, భారత్‌తో మంచి సంబంధాలు లేని దేశం పాల్గొన్నప్పటికీ, మనం ఆడాల్సిందే. కానీ ద్వైపాక్షిక సిరీస్‌ల విషయానికొస్తే.. మనం ఏ శత్రుదేశంతోనూ ఆడబోం’ అని బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఇటీవలే వివరణ ఇచ్చారు. అయినప్పటికీ టికెట్లు అమ్ముడుపోకపోవడం గమనార్హం.

Read Also: Ukraine Crisis: ఉక్రెయిన్ తో శాంతి చర్చలు నిలిచాయి.. రష్యా కీలక ప్రకటన

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad