IND vs PAK, U19 World Cup 2026: జింబాబ్వేలోని బులవాయో వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య నేడు (ఆదివారం) సూపర్ సిక్స్ పోరు జరగనుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత అండర్-19 జట్టు, ఈ ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికాలను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్ తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై 204 పరుగుల భారీ విజయంతో ఫామ్‌ను చాటుకుంది. అయితే, గత డిసెంబర్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
మ్యాచ్ వివరాలు:
వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో.
సమయం: మధ్యాహ్నం 1:00 గంటలకు (IST).
ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో సినిమా (డిస్నీ+ హాట్‌స్టార్).
సెమీఫైనల్ సమీకరణాలు:
పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరాలంటే భారత్‌పై కేవలం గెలవడమే కాదు, నెట్ రన్ రేట్ (NRR)ను కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. ఒకవేళ భారత్ మొదట బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేస్తే, పాక్ ఆ లక్ష్యాన్ని 35 ఓవర్లలోపే ఛేదించాలి. లేదా భారత్‌ను 215 పరుగుల లోపే కట్టడి చేయాలి. మరోవైపు, భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో నేరుగా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది.
Also Read: T20 World Cup 2026 -టీ20 వరల్డ్ కప్‌కు నిపా వైరస్ ముప్పు ఉందా? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
తుది జట్లు (అంచనా):
భారత్: వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ సింగ్, ఖిలాన్ పటేల్, ఆర్‌ఎస్ అంబరీష్, హెనిల్ పటేల్, ఉద్ధవ్ మోహన్, దీపేష్ దేవేంద్రన్, ఆరోన్ జార్జ్.
పాకిస్థాన్: సమీర్ మిన్హాస్, హంజా జహూర్ (కీపర్), ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హుజైఫా అహ్సాన్, మహమ్మద్ షయాన్, అబ్దుల్ సుభాన్, అలీ రజా, మోమిన్ ఖమర్, మహమ్మద్ సయ్యమ్.

