Saturday, November 15, 2025
HomeఆటIND vs SA: మూడో టీ20..టీమిండియా విజయం సాధిస్తుందా..?

IND vs SA: మూడో టీ20..టీమిండియా విజయం సాధిస్తుందా..?

IND vs SA| భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. ఇప్పటికే రెండు జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. దీంతో నాలుగు టీ20ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. సిరీస్ గెలిచి ట్రోఫీ అందుకోవాలంటే ఇవాళ జరిగే మూడో టీ20 మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. దీంతో ఈ మ్యాచ్‌ను గెలిచేందుకు సూర్యకుమార్ సేన గట్టి పట్టుదలతో ఉంది.

- Advertisement -

సెంచూరియన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్టు ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి రెండు మ్యాచుల్లో నిరాశపరిచిన ఓపెనర్ అభిషేక్ శర్మకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకటి లేదా రెండు మార్పులతో టీమిండియా బరిలో దిగే అవకాశం ఉంది.

తొలి టీ20లో ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టీ20లో మాత్రం చతికిలపడింది. బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు టీమిండియా టార్గెట్‌ను ఛేదించి తన ఖాతాలో విజయం నమోదుచేసింది. దీంతో సిరీస్‌ను సమం చేసింది. ఇవాళ జరిగే మూడో టీ20లోనూ గెలిచి ట్రోఫీ అందుకోవాలని తహతహలాడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad