Asia Cup: ఓవైపు ఎదురేలేకుండాఆసియా కప్ ఫైనల్స్ దూసుకెళ్లిన భారత్.. మరోవైపు వరుస ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక మధ్య పోరు జరిగింది. అయితే, అందరూ భారత్ ఈజీగా గెలుస్తుందనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఈసారి టోర్నీలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఛేదనలో లంక తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఇంకేముంది.. ప్రత్యర్థిని భారత బౌలర్లు చుట్టేయడం, భారత్ ఖాతాలో మరో ఘనవిజయం చేరడం లాంఛనమే అనుకున్నారంతా! కానీ తర్వాత అంతా మారిపోయింది.
నిశాంక సెంచరీ..
నిశాంక సంచలన శతకానికి… కుశాల్ పెరీరా మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో భారత్‌ను లంక ఓడించినంత పని చేసింది. కానీ ఆఖర్లో పుంజుకున్న భారత్ మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు మళ్లించింది. అందులో అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లంక పనైపోయింది. భారత్ అజేయంగా పాక్‌తో ఫైనల్‌కు సిద్ధమైంది. ఆసియా కప్ టీ20 టోర్నీలో పాకిస్థాన్‌తో ఫైనల్ ముంగిట భారత్ స్ఫూర్తిదాయక విజయం సాధించింది. ఉత్కంఠ రేపిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో భారత్.. సూపర్ ఓవర్లో గెలిచింది. మొదట అభిషేక్ శర్మ (61; 31 బంతుల్లో 8×4, 2×6), తిలక్ వర్మ (49 నాటౌట్; 34 బంతుల్లో 4×4, 1×6), సంజు శాంసన్ (39; 23 బంతుల్లో 1×4, 3×6) రాణించడంతో భారత్ 5 వికెట్లకు 202 పరుగులు చేసింది.
Read Also: Bigg Boss Updates: మిడ్ వీక్ సంజనా ఎలిమినేట్.. సైకో ఆనందమా అని హరీష్ కామెంట్
శ్రీలంక..
ఆ తర్వాత శ్రీలంక కూడా 20 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి సరిగ్గా 202 పరుగులే చేసింది. నిశాంక (107; 58 బంతుల్లో 7×4, 6×6) సంచలన శతకం సాధించగా.. కుశాల్ పెరీరా (58: 32 బంతుల్లో 8×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక ఇన్నింగ్స్‌లో తేలిపోయిన అర్ష్‌దీప్.. సూపర్ ఓవర్లో గొప్పగా బౌలింగ్ చేశాడు. అతను 5 బంతుల్లోనే 2 వికెట్లు తీయడంతో లంక ఇన్నింగ్స్ 2 పరుగుల వద్దే ముగిసింది. తొలి బంతికే కుశాల్ పెరీరా ఔట్ కాగా.. నాలుగో బంతికి శానకను శాంసన్ రనౌట్ చేశాడు. కానీ రనౌట్ కంటే ముందే అంపైర్ క్యాచ్ ఔట్ ఇవ్వగా.. రివ్యూ ద్వారా అతను బతికిపోయాడు. అయితే తర్వాతి బంతికే అతణ్ని అర్ష్‌దీప్ ఔట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఆ స్కోరును భారత్ తొలి బంతికే వికెట్ కోల్పోకుండా ఛేదించింది. భారత్, పాక్ మధ్య ఆదివారం ఫైనల్ జరుగుతుంది.
Read Also: Bigg Boss 9 Telugu: సీక్రెట్ రూమ్‌లో సంజన.. ఒంటరైపోయా.. కెప్టెన్ అయిన రోజే ఏడ్చేసిన ఇమ్మూ


