Thursday, January 22, 2026
HomeఆటU19 Asia Cup: వైభవ్ ఊచకోత.. బోణీ కొట్టిన భారత్..

U19 Asia Cup: వైభవ్ ఊచకోత.. బోణీ కొట్టిన భారత్..

- Advertisement -

India vs UAE U19 Asia Cup 2025 Highlights: అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. శుక్రవారం దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు అతిథ్య యూఏఈపై 234 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. యంగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

వైభవ్ ఊచకోత..

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వైభవ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే(4) స్వల్ప స్కోరుకే ఔటైనప్పటికీ అరోన్ జార్జ్ తో కలిసి యూఏఈ బౌలర్లను ఊచకోత కోశాడు. ఫోర్లు, సిక్సర్లుతో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. అతడు కేవలం 56 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మరో ఎండలో జార్జ్ కూడా నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 146 బంతుల్లోనే 212 పరుగులు జోడించారు. 220 పరుగుల వద్ద భారత్ జార్జ్(69) వికెట్ ను కోల్పోయింది.

జార్జ్ తర్వాత క్రీజులోకి వచ్చిన విహాన్ మల్హోత్రాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు సూర్యవంశీ. ఈ క్రమంలో 150 పరుగుల మార్క్ దాటాడు. అయితే 265 పరుగుల వద్ద వైభవ్ ఔటయ్యాడు. అతడు కేవలం 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 171 పరుగులు చేశాడు. అనంతరం విహాన్, త్రివేదితో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 66 బంతుల్లో 88 పరుగులు జోడించారు. చివర్లో అభిజ్ఞాన్ కుందు, కనిష్క చౌహాన్ కూడా బ్యాట్ ఝలిపించడంతో టీమ్ ఇండియా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 433 పరుగులు చేసింది.

Also Read: Irfan Pathan- ‘గిల్ ఫామ్ బ్యాడ్ సైన్.. జట్టు కూర్పుపై ఒత్తిడి పెంచుతోంది’

53 పరుగులకే 6 వికెట్లు..

అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన అతిథ్య యూఏఈ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆ జట్టు బ్యాటర్లలో పృథ్వీ మధు(50), సూరి(78) మాత్రమే రాణించగా…మిగతా వారంతా తక్కువ స్కోర్లుకే పెవిలియన్ చేరారు. దీంతో యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. దీంతో మాత్రే సేన 234 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో దేవేంద్రన్ రెండు వికెట్లు తీశాడు. మన జట్టు తన తర్వాత మ్యాచ్ ను ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతుంది.

Also Read: Ind vs SA- తిలక్ పోరాటం వృథా.. రెండో టీ20 సౌతాఫ్రికాదే..

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News