వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ముంబై వేదికగా ఇవాళ జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ ఉమెన్స్ టీమ్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ ఆ జట్టు బ్యాటర్లలో చినెల్లె హెన్రీ (61) హాఫ్ సెంచరీ సాధించగా.. క్యాంప్‌బెల్లె (46) పరుగులతో రాణించింది. ఇక భారత బౌలర్లలో దీప్తిశర్మ 31 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్ 29 పరుగులు ఇచ్చి 4 పరుగులు చేసింది.
అనంతరం 163 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 28.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్ రౌండర్ దీప్తిశర్మ 48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 32 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 29 పరుగులు, రిచా ఘోష్ 23 పరుగులతో రాణించారు. కాగా అంతకుముందు వెస్టిండీస్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ కూడా టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.