స్వదేశంలో ఐర్లాండ్‌తో(IND w VS IRE w) జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత మహిళా జట్టును బీసీసీఐ ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఫాస్ట్ బౌలర్ రేణుకాసింగ్‌కు రెస్ట్ ఇచ్చింది. దీంతో జట్టుకు స్మృతి మంధాన(Smriti Mandhana) కెప్టెన్సీ వహించనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా మైదానం వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్ జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రీ (WK), రిచా ఘోష్ (WK), తేజల్ హసబ్నిస్, రాఘ్వి బిస్త్, ప్రియా మిశ్రా, తనుజా కాన్వెర్, టిటాస్ సధు, సైమా ఠాకూర్, సయాలి సత్ఘరె
మ్యాచ్‌ల షెడ్యూల్..
తొలి వన్డే: జనవరి 10, ఉదయం 11 గంటలకు
రెండో వన్డే: జనవరి 12, ఉదయం 11 గంటలకు
మూడో వన్డే: జనవరి 15, ఉదయం 11 గంటలకు