భారత అండర్ 19 మహిళల టీమ్ విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో వరుసగా రెండోసారి అండర్ 19 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగాగా నిలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టు.. 82 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా బౌలర్ల అద్భుతంగా ఆడటంతో.. ఒక్కరు కూడా సరిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. సఫారీ జట్టు 44 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. వాన్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 11.2 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించేశారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష (44*) ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. మరో ఓపెనర్ కమలిని (8) తక్కువ స్కోర్‌కే ఔట్ అయినా.. వన్ డౌన్లో వచ్చిన సనికా చాల్కేతో కలిసి త్రిష టార్గెట్ ఫినిష్ చేశారు. ఇక ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన త్రిషకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డు దక్కింది.