IND vs PAK Women’s ODI 2025: కొలంబోలో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా, రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దాయాది జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు చిత్తుగా ఓడించింది.
మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు.. 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక, దీనికి సమాధానంగా పాకిస్థాన్‌ను 43 ఓవర్లలో కేవలం 159 పరుగులకే మట్టి కరిపించింది.
Also Read: https://teluguprabha.net/sports-news/ind-vs-pak-odi-women-2025-india-score-247/
కాగా, పాక్ ప్లేయర్ సిద్రా అమీన్ పోరాడి చేసిన 81 పరుగులు వృథా అయ్యాయి. ఇతర ప్లేయర్ల నుంచి బలమైన తోడ్పాటు లేకపోవడంతో పాక్‌కు పరాజయం తప్పలేదు. భారత జట్టు తరపున క్రాంతి గౌర్, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. తదుపరి మ్యాచ్ ఈ నెల 9న వైజాగ్‌లో దక్షిణాఫ్రికాతో జరగనుంది.


