Asia Cup 2025: ఆసియా కప్-2025లో భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖండాంతర టోర్నీలో దాయాదితో సమరానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలో టీమిండియా పాక్‌తో ఆడితే ఆపబోమని స్పష్టం చేసింది. అయితే, పాక్‌తో ఏ క్రీడల్లో అయినా ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఉండవవి తేల్చి చెప్పింది. వారు తమ గడ్డపై అడుగు పెట్టడానికి కానీ.. భారత జట్టు పాక్‌లో ఆడటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని తెలిపింది. అంతర్జాతీయ టోర్నీల్లో, తటస్థ వేదికలపై పాకిస్థాన్ తో మ్యాచ్‌లు ఆడితే అభ్యంతరం లేదని పేర్కొంది. దీంతో, సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరుగబోయే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయినట్లే.
Read Also: Online gaming bill: పార్లమెంటులో బిల్లుకి ఆమోదం.. ఇది దేనికి సూచనంటే?
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత..
మరోవైపు, పహెల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌పై అనుమానాలు ఉండేవి. అయితే, ఈ టోర్నీలో టీమిండియా పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతించదని ప్రచారం జరిగింది. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ టీమిండియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి దుబాయ్, అబుదాబీ వేదికలుగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో (ఏ) ఉన్నాయి. టీమిండియా సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్థాన్.. సెప్టెంబర్ 19న ఒమన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఆగస్ట్ 19న ప్రకటించారు.
Read Also: ODI captain: వన్డే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్.. ?
ఆసియా కప్ కోసం భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్


