Saturday, November 15, 2025
HomeఆటRinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ నిశ్చితార్థం

Rinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ నిశ్చితార్థం

భారత క్రికెటర్ రింకు సింగ్ (Rinku Singh), సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌(Priya Saroj) నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. లక్నోలోని హోటల్ ది సెంట్రమ్‌లో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. వీరి వివాహం నవంబర్ 18న వారణాసిలోని తాజ్ హోటల్లో జరగనుంది.

ఈ వేడుకకు భారత మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లాతో పాటు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, తదితర ప్రముఖులులు అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం వారి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు, సెలబ్రెటీలు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.

రింకూ సింగ్ టీమిడింయాతో పాటు IPL 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అలాగే ప్రియా సరోజ్ సమాజ్ వాదీ పార్టీ తరపున మచ్ఛలీషహర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. కాగి రింకూ, ప్రియా ఓ పెళ్లిలో కలుసుకున్నారు. అనంతరం ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. రింకు కాబోయే భార్య ప్రియా సరోజ్ 1998 నవంబర్ 23న జన్మించింది. 25 ఏళ్ల వయసులో లోక్ సభకు ఎన్నికయ్యారు. గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె తండ్రి తుఫానీ సరోజ్ కూడా ఎంపీగా పనిచేశారు.

కాగా రింకూ టీమిండియా తరపున ఇప్పటివరకు 2 వన్డేలు, 33 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. రెండేళ్ల క్రితం ఐపీఎల్ లో భాగంగా చివరి 5 బంతులకు 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్ జట్టును గెలిపించాడు. అప్పటి నుంచి రింకూ పేరు మార్మోగుతోంది. టీమిండియాకు ధోనీ లాంటి ఫినిషర్ దొరికాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad