IND vs PAK, Asia Cup: ఆసియా కప్ లో దాయాదుల పోరు రసవత్తరంగా సాగింది. సూపర్-4లో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో టీమిండియా పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవరల్లో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫర్హాన్ హాప్ సెంచరీతో సత్తా చాటాడు. భారత బౌలర్లలో శివమ్ ధూబే రెండు వికెట్లు తీశాడు.
ఛేజింగ్ లో భారత్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరూ కూడా పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. అభిషేక్ శర్మ తనదైన శైలిలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతడు హాఫ్ సెంచరీ(74) కూడా సాధించాడు. గిల్ తోపాటు చివర్లో తిలక్ వర్మ కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు. అభిషేక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
బై బై పాకిస్తాన్..
సూపర్ -4 ఫైట్ లో టీమిండియా చేతిలో ఓడిపోయి బాధలో ఉన్న పాకిస్తాన్ కు ఓ భారత అభిమని చేసిన పని మరింత అవమానకరంగా మారింది. స్టేడియంలో ఆకుపచ్చ చీర ధరించిన ఓ యువతి ‘బై బై పాకిస్తాన్’ అంటూ నినాదాలు చేసింది. ఆ అమ్మాయి చూపించిన ఉత్సాహం, దుస్తులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్కడున్న వారు ఈ అందమైన యువతి చేసిన పనిని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వారే మా ఓటమి కారణం: పాక్ కెప్టెన్
లీగ్ దశ, సూపర్-4 పోరులో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. వీరి బుద్ధి మారదంటూ కొందరు.. గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పాక్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడాడు. భారత ఓపెనర్లు తమ నుంచి మ్యాచ్ ను లాక్కున్నారని సల్మాన్ అన్నారు. తమకు ఫ్లాట్ పిచ్‌లు కాకుండా మరింత మంచి పిచ్‌లు తయారు చేస్తే మరింత మెరుగైన ప్రదర్శన చేసేవారని తమ సొంత దేశానికి చురకలు అంటించాడు.


