Saturday, November 15, 2025
HomeఆటICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు హవా

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు హవా

ICC Rankings| బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసిన భారత్ ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిశారు. ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన బుమ్రా ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుమ్రా తొలి స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడ, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో నిలిచాడు. మరో బౌలర్ రవీంద్ర జడేజా ఏడో స్థానం దక్కించుకున్నాడు.

- Advertisement -

ఇక బ్యాటింగ్ విభాగంలోనూ టీమిండియా ప్లేయర్స్ అదరగొట్టారు. ఆస్ట్రేలియాపై సెంచరీలు బాదిన యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. జైశ్వాల్ రెండో స్థానంలో నిలవగా.. అగ్రస్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ కొనసాగుతున్నాడు. ఇక రిషబ్ పంత్ ఆరో స్థానం దక్కించుకోగా.. విరాట్ కోహ్లీ ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకున్నాడు.

ఇదిలా ఉంటే టెస్టుల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లుగా భారత స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నారు. ఇద్దరు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ నిలిచాడు. ఇక వన్డే బ్యాటింగ్‌ ర్యాంకుల్లో బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉండగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad