Saturday, January 4, 2025
HomeఆటIND vs ENG: ఇంగ్లాండ్‌తో వన్డేలు, టీ20లు.. సీనియర్స్‌కు రెస్ట్..!

IND vs ENG: ఇంగ్లాండ్‌తో వన్డేలు, టీ20లు.. సీనియర్స్‌కు రెస్ట్..!

ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండు టెస్టులు ఓడిపోయిన రోహిత్ సేన.. ఒక్క టెస్టును గెలుచుకుని, మరో టెస్టును డ్రా చేసింది. దీంతో చివరిదైన ఐదో టెస్టులో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఆ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. అయితే ఈ సిరీస్‌ అయిపోగానే స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో(IND vs ENG) వైట్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

- Advertisement -

ఈ రెండు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించేందుకు సెలెక్టర్లు కసరత్తు పూర్తి చేస్తున్నారు. ఈ సిరీస్ అయిపోయిన వారం రోజులకే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీంతో స్టార్ ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సుదీర్ఘ క్రికెట్ ఆడుతున్న పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు విశ్రాంతి ఇచ్చే అవకాశముందని సమాచారం. అలాగే విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్‌ శర్మ(Rohit Sharma)లకు విశ్రాంతి ఇవ్వాలా? వద్దా..? అనే విషయంపై సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

ఐదు టీ20ల సిరీస్ షెడ్యూల్..

జనవరి 22 – తొలి టీ20 (కోల్‌కతా)
జనవరి 25 – రెండో టీ20 (చెన్నై)
జనవరి 28 – మూడో టీ20 (రాజ్‌కోట్‌)
జనవరి 31 – నాలుగో టీ20 (పుణె)
ఫిబ్రవరి 2 – ఐదో టీ20 (ముంబై)

వన్డే సిరీస్ షెడ్యూల్..

ఫిబ్రవరి 6 – తొలి వన్డే (నాగ్‌పుర్)
ఫిబ్రవరి 9 – రెండో వన్డే (కటక్)
ఫిబ్రవరి 12 – మూడో వన్డే (అహ్మదాబాద్)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News