Sunday, November 16, 2025
HomeఆటBWF: కఠిన పోటీదారులతో బరిలోకి దిగనున్న భారత ఆటగాళ్లు..!

BWF: కఠిన పోటీదారులతో బరిలోకి దిగనున్న భారత ఆటగాళ్లు..!

Kuala Lumpur: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బుధవారం మలేషియాలోని కౌలాలంపూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2025 కోసం డ్రాలను ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత స్టార్ షట్లర్లు కఠిన పోటీదారులతో బరిలోకి దిగనున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌లో 21వ స్థానంలో ఉన్న లక్ష్య సేన్‌కు మొదటి రౌండ్‌లోనే కఠిన సవాల్ ఎదురయ్యింది. ప్రస్తుతం ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ అయిన టాప్ సీడ్ షి యువ్ చీతో లక్ష్య సేన్‌ తలపడనున్నాడు. షి యువ్ చీ చైనా దేశానికి చెందిన కీలక ఆటగాడు. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య నలుగురు మ్యాచ్‌లు జరగగా, లక్ష్యకు కేవలం ఒక విజయమే ఉంది (1-3 హెడ్ టు హెడ్ రికార్డు). గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కంచు పతకం గెలిచిన హెచ్.ఎస్. ప్రణయ్, మొదటి రౌండ్‌లో ఫిన్లాండ్‌కు చెందిన జాకోబ్ ఓల్డారఫ్‌ను ఎదుర్కొంటాడు. వీరి మధ్య ఇది తొలి మ్యాచ్ కానుండటంతో, ఇది ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

Read more: https://teluguprabha.net/sports-news/supreme-court-cancels-sushil-kumars-bail-orders-surrender-in-a-week/

మహిళల సింగిల్స్‌లో ఏకైక భారత క్రీడాకారిణి, 15వ సీడ్ పీవీ సింధు బల్గేరియాకు చెందిన కలోయనా నల్బాంటోవాతో తొలి రౌండ్‌లో తలపడనుంది. అయితే మూడో రౌండ్‌లో ఆమె ప్రపంచ రెండో ర్యాంకర్ చైనాకు చెందిన వాంగ్ జి యీతో తలపడే అవకాశముంది. వీరి మధ్య ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో ఇద్దరూ రెండు విజయాలను సాధించారు (2-2 రికార్డు).

భారత్‌ పురుషుల డబుల్స్‌ లో టాప్ జోడీ అయిన సాత్విక్ సైరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి జంటకు తొలి రౌండ్‌లో బై లభించింది. వారు రెండో రౌండ్‌లో భారత్‌కు చెందిన హరిహరణ్ అంసకరుణన్/రూబన్ కుమార్ రెతినసాబపతి జంట మరియు చైనీస్ తైపేకు చెందిన లియూ క్వాంగ్ హెంగ్/యాంగ్ పో హాన్ జంటల మధ్య గెలిచినవారితో తలపడనున్నారు. అయితే, వారు క్వార్టర్‌ ఫైనల్స్‌కి చేరితే టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్న చైనాకు చెందిన లియాంగ్ వెయ్ కేంగ్/వాంగ్ చాంగ్ జంటను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ జంటపై రంకిరెడ్డి/శెట్టీలకు ఇప్పటి వరకు కేవలం రెండు విజయాలు మాత్రమే ఉన్నాయి (2-6 హెడ్ టు హెడ్).

Read more: https://teluguprabha.net/sports-news/team-india-test-captain-shubman-gill-won-icc-mens-player-of-the-month-for-july-2025/

12వ సీడ్‌ త్రీసా జాలీ/పి.గాయత్రి గోపీచంద్ జంట ఉపసంహరణ కారణంగా మహిళల డబుల్స్ విభాగంలో ప్రియా కొంజెంగ్‌ బాం/శృతి మిశ్రా మరియు రుత్వర్ణా/స్వేతపర్ణా పాండా జంటలు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో 16వ సీడ్‌ ధ్రువ్ కపిలా/తనిషా క్రాస్టో జంటకు మొదటి రౌండ్ బై లభించింది. మరో భారత జంటగా రోహన్ కపూర్/రుత్విక శివాని గడ్డె కూడా ఈ విభాగంలో పోటీపడనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad