Indian team new captain: రోహిత్ శర్మ విషయంలో అనుకున్నదే జరిగింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసినట్లుగా అజిత్ అగార్కర్ అండ్ కో వెల్లడించింది. అయితే రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లి వన్డే జట్టులో సభ్యులుగా కొనసాగనున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టు ఎంపిక సందర్భంగా ఈ నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకున్నారు.
2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా రోహిత్ శర్మ స్ధానంలో కెప్టెన్‌గా గిల్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ఎంపిక చేసినట్లు క్రికెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రపంచ కప్‌కు ఇంకా రెండేళ్ల కంటే ఎక్కువ సమయం ఉండడంతో అప్పటివరకు రోహిత్ ఆడుతాడో లేదో స్పష్టత లేనందున భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Also Read: https://teluguprabha.net/sports-news/india-win-against-west-indies-in-ahmedabad-test-match/
త్వరలో ఆస్ట్రేలియా పర్యటన: ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా టీంఇండియా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం అజిత్ అగార్కర్ అండ్ కో సెలక్టర్లుల రెండు వేరువేరు జట్లను ప్రకటించారు. న్డేలకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, 20లకు సూర్యకుమార్ సారథిగా ఉండనున్నారు. అక్టోబర్ 19 నుంచి వన్డే, 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి.
వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
టీ20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్, కుల్‌దీప్, హర్షిత్, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.


