India reached Asia Cup 2025 final: ఆసియాకప్‌లో భారత్ జోరు కొనసాగుతుంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. బంగ్లాదేశ్‌పై విజయంతో సూర్య బృందం ఆసియాకప్ ఫైనల్‌కు చేరింది. అభిషేక్ విధ్వంసానికి కుల్‌దీప్ మాయాజాలం తోడవడంతో సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాను చిత్తుచేసింది.
అభిషేక్ అద్భుత బ్యాటింగ్: భారతజట్టు ఆసియాకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ 4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఇండియా విజయంలో అభిషేక్ శర్మ (75; 37 బంతుల్లో 6×4, 5×6), కుల్‌దీప్ యాదవ్ (3/18) కీలక పాత్ర పోషించారు. అయితే అభిషేక్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినా.. భారత్ అనుకున్న దానికన్నా తక్కువ స్కోరే చేసింది. భారీ స్కోరు చేసేలా కనిపించిన టీంఇండియా కేవలం 168/6తో సరిపెట్టుకుంది. హార్దిక్ (38; 29 బంతుల్లో 4×4, 1×6), గిల్ (29; 19 బంతుల్లో 2×4, 1×6) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లు రిషాద్ (2/27), తంజిమ్ (1/29), ముస్తాఫిజుర్ (1/33) భారత్‌ను కట్టడి చేశారు. ఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌటైంది. కుల్‌దీప్‌తో పాటు వరుణ్ చక్రవర్తి (2/29), బుమ్రా (2/18) కూడా బంగ్లా జట్టును దెబ్బతీశారు. బంగ్లా ఓపెనర్ సైఫ్ హసన్ (69; 51 బంతుల్లో 3×4, 5×6) ఒంటరి పోరాటం చేసినప్పటికి మిగితా ప్లేయర్లు భారత బౌలింగ్ దాటికి నిలబడలేకపోయారు.
ఒంటరి పోరాటం చేసిన సైఫ్ హసన్: బంగ్లా ఛేదనలో ఓపెనర్ సైఫ్ హాసన్ ఆట మాత్రమే హైలైట్‌గా నిలిచింది. మరోవైపు నుంచి వికెట్లు పోతున్నా.. అతడు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. భారత ఫీల్డర్లు ఈ మ్యాచ్‌లో కుడా అనేక క్యాచ్‌లు వదిలేసింది. బంగ్లాను 2వ ఓవర్లోనే బుమ్రా దెబ్బతీశాడు. ఓపెనర్ తంజిద్ (1)ను అతడు ఔట్ చేశాడు. అయినప్పటికి బంగ్లా చకచక పరుగులు చేస్తూ ముందుకు సాగింది. సైఫ్ హసన్ సూపర్ బ్యాటింగ్‌తో అతడు బంగ్లాను కొంతవరకు రేసులో నిలిపాడు. అతడితో రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించిన ఎమాన్ (21) కుల్‌దీప్ చేతిలో ఔట్ అయ్యాడు. పది ఓవర్లకు బంగ్లా 65/2తో నిలిచింది. అయితే భారత్ చకచకా వికెట్లు పడగొట్టింది. హృదోయ్ (7)ని అక్షర్, షమిమ్ (0)ను వరుణ్ ఔట్ చేయగా.. సూర్య సూపర్ త్రోకు జేకర్ అలీ (4) రనౌటయ్యాడు.
ధీమా ఉండలేని పరిస్థితి: బంగ్లా 87/5కు పరిమితమైనా భారత్‌కు గెలుపుపై ధీమా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే హసన్ సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అక్షర్ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన అతడు.. తన దూకుడుతో భారత్‌ను కలవర పెట్టాడు. ఆఖరి ఆరు ఓవర్లలో బంగ్లాకు 67 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ దశలో కుల్‌దీప్ సూపర్ బౌలింగ్‌తో.. భారత్ పైచేయి సాధించింది. 15వ ఓవర్లో ఆరు పరుగులే ఇచ్చిన అతడు.. తన తర్వాతి ఓవర్లో కేవలం మూడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. రిషాద్, తంజిమ్‌లను కుల్‌దీప్ ఔట్ చేశాడు. అంతవరకు ధాటిగా ఆడుతున్న సైఫ్ హసన్‌ను బుమ్రా తర్వాతి ఓవర్లోనే ఔట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లో వచ్చింది.


