Thursday, December 19, 2024
HomeఆటTeam India: ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌పై భారత్ ఘన విజయం

Team India: ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌పై భారత్ ఘన విజయం

Team India| ఆస్ట్రేలియా పీఎం(PMXI) ఎలెవన్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 50 ఓవర్లకు కుదించారు. అయితే మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వరుణుడు అంతరాయం కలిగించడంతో 46 ఓవర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌ 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ సామ్ కాన్స్‌టస్‌ (107; 97 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌)తో అదరగొట్టాడు. ఇక తొమ్మిదో స్థానంలో వచ్చిన హన్నో జాకబ్స్(61; 61 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాక్ క్లేటన్ (40; 52 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లతో హర్షిత్ రాణా 4 వికెట్లు, ఆకాశ్ దీప్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు

ఇక 241 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (45; 59 బంతుల్లో 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (27 రిటైర్డ్ హర్ట్; 44 బంతుల్లో 4 ఫోర్లు) శుభారంభం అందించారు. అనంతరం వచ్చిన శుభ్‌మన్ గిల్ (50 రిటైర్డ్ హర్ట్; 62 బంతుల్లో 7 ఫోర్లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (42; 32 బంతులలో 5 ఫోర్లు, 1 సిక్స్‌), వాషింగ్టన్ సుందర్‌ (42*; 36 బంతుల్లో 5 ఫోర్లు), రవీంద్ర జడేజా (27; 31 బంతుల్లో) రాణించారు.

అయితే నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ రోహిత్ (3) మాత్రం నిరాశపర్చాడు. కోహ్లీ అయితే బ్యాటింగ్‌కు దిగలేదు. ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌ బౌలర్లలో చార్లీ ఆండర్సన్ 2, లాయిడ్ పోప్, రెన్‌షా చెరో వికెట్ తీశారు. కాగా డిసెంబరు 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో (పింక్ బాల్)టెస్టు ప్రారంభంకానుంది. డే/నైట్‌ పద్ధతిలో జరగనున్ను ఈ మ్యాచ్‌కు అడిలైడ్‌ ఓవల్‌ గ్రౌండ్ వేదిక కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News