Sanju Samson-Asia Cup 2025: ఆసియా కప్ 2025కు ముందు భారత జట్టుకు బ్యాడ్ న్యూస్. మెగా టోర్నీకి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ ఆస్పత్రిలో చేరాడు. ఈ వార్తను స్వయంగా ఆయన భార్య చారులత రమేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. టోర్నీకి ఇంకా కొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉండటంతో.. ఇప్పడు సంజూ ఆస్పత్రి పాలవ్వడం ఆయన అభిమానులతోపాటు జట్టు మేనేజ్మెంట్ ను కూడా కలవరపరిచే ఆంశం.
సెప్టెంబర్ 9న యూఏఈ వేదికగా ప్రారంభంగానున్న ఆసియా కప్ సెప్టెంబర్ 28న ముగియనుంది. ఆగస్టు 21న మధ్యాహ్నం 3 గంటలకు సామ్సన్ ఆసుపత్రిలో చేరినట్లు చారులత రమేశ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అయితే అదే రోజు సాయంత్రం కేరళ క్రికెట్ లీగ్ (KCL)2025లోని కొచ్చి బ్లూ టైగర్స్ తన రెండో మ్యాచ్ ను అదానీ త్రివేండ్రం రాయల్స్ తో ఆడింది. ఈ మ్యాచ్ లో సంజూ కెప్టెన్ గా ఉన్న కొచ్చి బ్లూ టైగర్స్ ప్రత్యర్థిపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో శాంసన్ ఫీల్డింగ్ చేశాడు కానీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే అదే రోజు ఆయన ఎందుకు ఆసుపత్రిలో చేరారనేది తెలియరాలేదు.
సూపర్ ఫామ్ లో సంజూ..
ఆసియా కప్‌కు ముందు సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కెప్టెన్ గా మాత్రమే కాకుండా బ్యాటర్ గా కూడా రాణించాడు. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కేసీఏ సెక్రటరీ XIకి కెప్టెన్‌గా వ్యవహారించిన అతడు తన జట్టుకు విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేసీఏ ప్రెసిడెంట్ XI 20 ఓవర్లలో 184/8 పరుగులు చేసింది. బ్యాటర్లలో రోహన్ కున్నుమల్ 29 బంతుల్లో 60 పరుగులు, అభిజిత్ ప్రవీణ్ 18 బంతుల్లో 47 పరుగులు చేశారు. లక్ష్యచేధనలో బరిలోకి దిగిన సెక్రటరీ XI 19.4 ఓవర్లలో 188/9 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సంజు శాంసన్ 36 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
Also Read: India Cricket Team -బీసీసీఐ కీలక నిర్ణయం.. రాబోయే వరల్డ్ కప్ కోసం కొత్త సెలక్టర్లు ఎంపిక..
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ సింగ్ రాణా.
Also Read:
Also Read: Asia Cup – ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఎవరిది పై చేయంటే?


