KL Rahul: ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను క్రికెట్ కోసం ఎంతో శ్రమిస్తానని అన్నాడు. భారత్ తరఫున అన్ని ఫార్మెట్లలో ఆడాలనేది తన లక్ష్యమని పేర్కొన్నాడు.
టెస్ట్ ప్లేయర్‌గా ముద్ర వేశారు: తనను ఎప్పుడూ ఒక టీ20 ఆటగాడిగా చూడలేదని కేఎల్ రాహుల్ అన్నాడు. పదేళ్ల క్రితం టీ20 టీమ్‌లో భాగం కావడానికి ఎంతో కష్టపడ్డానని తెలిపారు. అయితే కనీసం నన్ను మంచి వైట్ బాల్ ఆటగాడిగానూ పరిగణించలేదని అన్నారు. కేవలం టెస్ట్ ప్లేయర్‌గా ముద్రవేశారని తెలిపారు. ఆ ధోరణి నుంచి బయటపడేందుకు మైదానంలో చాలా శ్రమిస్తున్నానని పేర్కొన్నారు. మెరుగైన ఆటతో ఇక్కడి వరకు చేరడం నిజంగా ఆనందంగా ఉందని రాహుల్ అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో దిల్లీ తరపున ఆడుతున్న రాహుల్.. మంచి ఫాంను కొనసాగిస్తున్నారు.
Also read-MI vs LSG: రో’హిట్’, రికెల్టన్ సిక్సర్ల వర్షం.. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ ఘన విజయం
నేడు చెన్నైతో తలపడనున్న దిల్లీ: ఐపీఎల్-2026లో నేడు రసవత్తరమైన మ్యాచ్ ఉంది. దిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తలపడనుంది. ఈ మ్యాచ్ దిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. 8 పాయింట్లతో చెన్నైతో సమానంగా ఉన్న దిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. రాహుల్ మంచి ఫాంలో ఉండడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగ్గా చేసుకునేందుకు దిల్లీ చూస్తుంది. అయితే చైన్నై సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

