IPL 2023 Auction : అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మినీ వేలం ముగిసింది. ఈ సారి కప్ గెలవడమే లక్ష్యంగా పది ప్రాంఛైజీలు తమకు కావాల్సిన ప్లేయర్లను వేలంలో సొంతం చేసుకున్నాయి. ఈ సారి ఆల్‌రౌండర్లపై కనకవర్షం కురిసింది. సామ్ కరన్ అందరి కంటే అత్యధికంగా రూ.18.5 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇతడిని పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. ఆ తరువాత ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ రూ.17.5 కోట్లకు ముంబై దక్కించుకుంది. ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ వశం అయ్యాడు.
వేలంలో పది ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను తీసుకున్నాయో చూద్దాం
కోల్‌కతా : మన్‌దీప్ సింగ్(రూ.50లక్షలు), లిట్టన్ దాస్(రూ.50లక్షలు), ఎన్. జగదీషన్(రూ.90లక్షలు), షకీబ్ అల్ హసన్(రూ.1.5కోట్లు), సూయాస్ శర్మ(రూ.20లక్షలు), వైభవ్ అరోరా(రూ.60లక్షలు),కుల్వంత్ ఖేజ్రోలియా(రూ.20లక్షలు), డేవిడ్ వైస్(రూ.1కోటి),
ముంబై : కామెరాన్ గ్రీన్(రూ.17.5కోట్లు), షామ్స్ ములని(రూ.20లక్షలు), విష్ణు వినోద్(రూ.20లక్షలు), డుయన్ జాన్సన్(రూ.20లక్షలు), పియూష్ చావ్లా(రూ.50లక్షలు), రాఘవ్ గోయల్(రూ.20లక్షలు),నేహళ్ వధేరా(రూ.20లక్షలు), జే రిచర్డ్‌సన్(రూ.1.5కోట్లు),
చెన్నై : బెన్ స్టోక్స్(రూ.16.25 కోట్లు), అజింక్యా రహానే(రూ.50 లక్షలు), నిశాంత్ సింధు(రూ.60లక్షలు), భగత్ వర్మ(రూ.20 లక్షలు) , కైల్ జెమీసన్(రూ. కోటి), షేక్ రషీద్(రూ.20 లక్షలు), అజయ్ మండల్(రూ.20 లక్షలు),
గుజరాత్ : శివన్ మావి(రూ.6కోట్లు), జోష్ లిటిల్(రూ.4.4కోట్లు), విలియమ్సన్ (రూ.2కోట్లు), కేఎస్ భరత్(రూ.1.2కోట్లు), మోహిత్ శర్మ(రూ.50లక్షలు), ఒడియన్ స్మిత్(రూ.50లక్షలు), ఉర్విల్(రూ.20లక్షలు),
లఖ్‌నవూ : నికోలస్ పూరన్(రూ.16కోట్లు), రొమారియో షెపర్డ్(రూ.50లక్షలు), అమిత్ మిశ్రా(రూ.50లక్షలు), సామ్స్(రూ.75లక్షలు),జయదేవ్ ఉనద్కత్(రూ.50లక్షలు), యశ్ ఠాకూర్(రూ.45లక్షలు), ప్రేరక్ మన్కడ్(రూ.20లక్షలు), స్వప్నిల్ సింగ్(రూ.20లక్షలు)
ఢిల్లీ : ఫిల్ సాల్ట్ (రూ. 2 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ. 50 లక్షలు), ముఖేష్ కుమార్ (రూ. 5.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 2.40 కోట్లు), రైలీ రస్సో (రూ. 4.60 కోట్లు) ఖర్చు చేసిన మొత్తం రూ.15 కోట్లు
పంజాబ్ : సామ్ కరన్(రూ.18.5కోట్లు), శివమ్ సింగ్(రూ.20లక్షలు), సికిందర్ రజా(రూ.50లక్షలు), హర్‌ప్రీత్(రూ.40లక్షలు), విద్వత్(రూ.20లక్షలు), మోహిత్(రూ.20లక్షలు),
హైదరాబాద్ : హ్యారీ బ్రూక్(రూ.13.25కోట్లు), మయాంక్ అగర్వాల్(రూ.8.25కోట్లు), హెన్రిచ్ క్లాసెన్(రూ.5.25కోట్లు), ఆదిల్ రషీద్(రూ.2కోట్లు), మయాంక్ మార్కండే(రూ.50లక్షలు), వివ్రాంత్ శర్మ(రూ.2.5కోట్లు), సమర్థ్ వ్యాస్(రూ.20లక్షలు), సన్వీర్ సింగ్(రూ.20లక్షలు), ఉపేంద్ర యాదవ్(రూ.25లక్షలు), మయాంక్ దాగర్(రూ.1.5కోట్లు), అకిల్ హోసేన్(రూ.1కోటీ), అన్మోల్ ప్రీత్ సింగ్(రూ.20లక్షలు), నితీష్ రెడ్డి(రూ.20లక్షలు)
బెంగళూరు : సోను యాదవ్ (రూ.20 లక్షలు), అవినాష్ సింగ్ (రూ.60 లక్షలు), రాజన్ కుమార్ (రూ.70 లక్షలు), మనోజ్ భాండాగే (రూ.20 లక్షలు), విల్ జాక్వెస్ (రూ.3.2 కోట్లు), హిమాన్షు శర్మ (రూ.20 లక్షలు), రీస్ టాప్లీ (రూ.1.9 కోట్లు).
రాజస్థాన్ : జాసన్ హోల్డర్ (రూ.5.75కోట్లు), ఆడమ్ జంపా (రూ.1.5కోట్లు), డోనోవన్ ఫెరీరా (రూ.50లక్షలు), కునాల్ సింగ్ రాథోర్ (రూ.20లక్షలు),కెఎమ్ ఆసిఫ్ (రూ.30లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ.20లక్షలు), ఆకాష్ వశిష్ట్ (రూ.20లక్షలు), అబ్దుల్ బాసిత్ (రూ.20లక్షలు), జోరూట్ (రూ.1కోటి)