Sunday, December 8, 2024
HomeఆటIPL Auction: ఐపీఎల్ మెగా వేలం ఎక్కడ.. ఎప్పుడంటే..?

IPL Auction: ఐపీఎల్ మెగా వేలం ఎక్కడ.. ఎప్పుడంటే..?

IPL Auction| ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మెగా వేలం డేట్లు, వేదిక ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఈ వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెల్లడనుందని చెబుతున్నాయి. కానీ నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాలో కీలకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ సిరీస్ భారత్‌ జట్టుకు ఎంతో కీలకమైంది. తొలి టెస్టు మధ్యలోనే వేలం నిర్వహిస్తారంటున్నారు. డిస్నీ హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐపీఎల్ వేలాన్ని కూడా హాట్ స్టార్ లైవ్ ఇవ్వనుంది.

- Advertisement -

భారత్-ఆస్ట్రేలియా జట్ట మధ్య జరిగే ఈ టెస్టు సిరీస్ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల నుంచి జరగనుంది. అందుకే మ్యాచ్ టైమింగ్స్‌కు ఇబ్బంది రాకుండా సౌద్ అరేబియా రాజధాని రియాద్‌లో మధ్యాహ్నం వేళల్లో వేలం కార్యక్రమం నిర్వహిస్తారని సమాచారం. ఈసారి ఐపీఎల్ వేలంపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈసారి చాలా మంది స్టార్ క్రికెటర్లు వేలంలోకి రానున్నారు. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కొంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. మిగిలిన జట్టు సభ్యులను వేలం ద్వారా కొనుగోలు చేయనున్నారు. మెగా వేలంలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు వచ్చే మూడేళ్ల పాటు జట్టులో ఉండనున్నారు.

భారత స్టార్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రిషభ్‌ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, సిరాజ్, షమీ, వెంకటేశ్ అయ్యర్ తదితరులు వేలంలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో పంత్, కేఎల్ రాహుల్ భారీ మొత్తంలో దక్కించుకోనున్నట్లు క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News