Friday, May 9, 2025
HomeఆటIPL 2025: లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2005(IPL 2025) ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ తరుణంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారత యువ బౌలర్ మయాంక్ యాదవ్(Mayank Yadav) కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వెన్నునొప్పి గాయం నుంచి కోలుకోవడానికి ఇంకొన్ని రోజులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాయంక్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ‌(NCA)లో చికిత్స పొందుతున్నాడు. అయితే మయాంక్ గాయంపై లక్నో ప్రాంచైజీ కానీ.. బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఫిట్‌నెస్ సాధిస్తే కొన్ని మ్యాచ్‌ల తర్వాత ఆడుతాడని ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

కాగా మెగా వేలానికి ముందు రూ.11 కోట్లకు మయాంక్‌ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2024 సీజన్‌కు ముందు రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తూ.. టాప్ బ్యాటర్లను సైతం ఇబ్బందులు పెట్టాడు. దీంతో మయాంక్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఈ క్రమంలో ఇండియా జట్టుకు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025లో లక్నో టీమ్ రిషభ్ పంత్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News