గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్ (Glenn Philiphs) ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. తాజాగా ఫిలిఫ్స్ స్థానంలో మరొక ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకుంది. శ్రీలంక మాజీ కెప్టెన్ దసున్ శనకతో(Dasun Shanaka) ఒప్పందం చేసుకుంది. శనక అనుభవం తమకు కలిసి వస్తుందని గుజరాత్ యాజమాన్యం భావిస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో వందకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన శనకకు గుజరాత్ రూ.75 లక్షలు చెల్లించనుంది. ఈమేరకు గుజరాత్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా ఫిలిఫ్స్ ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఆడకుండానే ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అతడు సబ్‌స్టిట్యూట్ ఫిల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. అయితే ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం విశ్రాంతి అవసరమని చెప్పారు. దీంతో ఈ కివీస్ ఆల్‌రౌండర్ స్వదేశం బయల్దేరి వెళ్లాడు.