Friday, May 9, 2025
HomeఆటIPL 2025: కాసేపట్లో ఐపీఎల్ ప్రారంభం.. వెరైటీగా గూగుల్ డూడుల్

IPL 2025: కాసేపట్లో ఐపీఎల్ ప్రారంభం.. వెరైటీగా గూగుల్ డూడుల్

మ‌రికాసేపట్లో యావత్ క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2025(IPL 2025) ప్రారంభం కానుంది. రెండు నెల‌ల‌కు పైగా అభిమానుల‌ను అల‌రించ‌నున్న ఈ మెగా టోర్నీ మే 25న జ‌రిగే ఫైన‌ల్‌తో ముగియనుంది. ఇవాళ తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్ర‌త్యేక డూడుల్‌(Google Doodle)ను రూపొందించింది.

- Advertisement -

డూడుల్‌ను క్రికెట్ పిచ్‌గా మార్చేసి, రెండు బాతులు క్రికెట్ ఆడుతున్న‌ట్లు చూపించింది. ఈ డూడుల్‌లో బ్యాట‌ర్‌ బంతిని కొడుతున్న దృశ్యం కనిపిస్తుంది. షాట్ ఆడిన వెంటనే, అంపైర్ తన చేతిని పైకెత్తి నాలుగు పరుగులు ఇవ్వ‌డం చూపించింది. ఇక డూడుల్‌పై క్లిక్ చేయ‌గానే మ్యాచ్ షెడ్యూల్‌, జ‌ట్టు లైనప్‌లు, మ్యాచ్ టైమింగ్స్ స‌హా అన్ని వివ‌రాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News