Tuesday, May 6, 2025
HomeఆటIPL 2025: ప్లేఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ ఔట్.. బరిలో ఏడు జట్లు

IPL 2025: ప్లేఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ ఔట్.. బరిలో ఏడు జట్లు

ఐపీఎల్‌-18లో(IPL 2025) సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌(Playoffs) రేసు నుంచి నిష్క్రమించింది. సోమవారం ఉప్పల్‌ స్టేడియంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు బౌలింగ్‌లో అదరగొట్టారు. దీంతో ఢిల్లీ 133 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం వర్షం పడటంతో మైదానం తడిసి ముద్దయింది. రెండు సూపర్‌ సాఫర్లు, గ్రౌండ్స్‌మెన్‌ తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. చివరకు మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. సన్‌రైజర్స్‌ 7 పాయింట్లతో సీజన్ నుంచి తప్పుకుంది. ఢిల్లీ టీమ్ మాత్రం 13 పాయింట్లతో అయిదో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -

ఇక ఐపీఎల్‌-18 లీగ్‌ దశలో సోమవారంతో 55 మ్యాచ్‌లు జరిగాయి. మొత్తం పది జట్లలో మూడు జట్లు(చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్) ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇక నాలుగు ప్లేఆఫ్స్‌ బెర్తుల కోసం ఏడు జట్ల మధ్య పోటీ నెలకొంది. బెంగళూరు 16 పాయింట్లతో ముందంజలో ఉండగా.. పంజాబ్‌(15 పాయింట్లు), ముంబై (14 పాయింట్లు), గుజరాత్‌ (14 పాయింట్లు) ప్లేఆఫ్స్‌కు చేరువగా ఉన్నాయి. ఢిల్లీ (13 పాయింట్లు), కోల్‌కతా (11 పాయింట్లు), లక్నో (10 పాయింట్లు) కూడా రేసులో ఉన్నాయి. అందుకే ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న ఏడు జట్లకు జరగబోయే ప్రతి మ్యాచ్‌ కీలకం అని చెప్పాలి. మరి ఏ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ చేరతాయో మరికొన్ని రోజుల్లో తేలనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News