ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ 20025(IPL 2025)కు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉంది. మార్చి 22 నుంచి మే 25వ తేదీ వరకు ఈ మహా సంగ్రామం కొనసాగనుంది. మార్చి 22న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడనుంది. ఈ క్రమంలోనే కేకేఆర్ జట్టు తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈసారి జెర్సీపై మూడు స్టార్లకు చోటు కల్పించింది. ఈమేరకు జెర్సీ లాంఛ్ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
కాగా కేకేఆర్ ఐపీఎల్‌లో మూడు సార్లు టైటిళ్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు కెప్టెన్‌ను మాత్రం నిర్ణయించుకోలేకపోయింది. వెంకటేశ్ అయ్యర్ లేదా అజింక్యా రహానె, సునీల్ నరైన్‌లో ఎవరో ఒకరిని సారథిగా నియమించే అవకాశం ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేకేఆర్ జట్టు: వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానె , క్వింటన్ డికాక్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రహమానుల్లా గుర్బాజ్ , అన్రిచ్ నార్ట్జే, రఘువంశీ, వైభవ్ అరోరా, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సన్, సిసోడియా, అనుకుల్ రాయ్, మాలీక్.