ఐపీఎల్ 2025 సీజన్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఒక్కో మ్యాచ్ కీలకం కావడంతో, జట్లు గట్టిగా పోటీపడుతున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 8) రెండు ఆసక్తికరమైన మ్యాచ్‌లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకోనున్నాయి.
మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ను ఎదుర్కొనబోతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా, లక్నో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేకేఆర్ మాత్రం రెండు విజయాలతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కి రివెంజ్ గేమ్‌గా భావిస్తున్న KKR అభిమానులు భారీగా మద్దతు తెలుపుతున్నారు.
మరో మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30కి రెండో మ్యాచ్ ముల్లాన్‌పూర్‌లో జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పంజాబ్ కింగ్స్‌తో (PBKS) తలపడనుంది. ప్లేఆఫ్ అవకాశాలను నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ చెన్నైకు తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తడిపడితే… తర్వాతి మ్యాచ్‌లలో ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధోనీ సేన ఎలా ఆడుతుందో అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో భారీగా నెలకొంది. చెన్నై ఇప్పటి వరకు సరిగ్గా ఆడలేకపోయింది. మరి ఈ పోరులో ఎలా ఆడనుందో చూడాలి.
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఓ వైపు జట్ల మధ్య తీవ్రవైన పోటీలు, మరోవైపు పాయింట్ల పట్టికలో రోజుకో కొత్త మలుపు ఫ్యాన్స్‌ను ఉత్కంఠలో ముంచెత్తుతున్నాయి. ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్ ఫలితం పట్టికను ప్రభావం చూపుతోంది. ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఇప్పటివరకు కనీసం ఆరు జట్లు తీవ్ర పోరాడుతున్నాయి.. అయితే ఏ చిన్న తప్పిదం కూడా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆడిన మూడు మ్యాచుల్లో మూడు విజయాలను ఆ జట్టు అందుకుంది. ఇక రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్, మూడో స్థానంలో ఆర్సీబీలు ఉన్నాయి. ఇక చివర్లో ఐదు మ్యాచులు ఒక విజయంతో సన్ రైజర్స్ జట్టు ఉంది. నాలుగు మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. మరి రాబోయే మ్యాచులు ఎలా ఉంటాయో చూడాలి.