ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో 13వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. లక్నో బ్యాటింగ్‌కు దిగగా, పంజాబ్ బౌలర్లు అదరగొట్టారు. దీంతో లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌ను తేలిగ్గా ఎదుర్కొని, 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 177 పరుగులతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ మార్ష్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మార్క్రమ్ (28) మంచి ఆరంభం ఇచ్చినా, నాల్గో ఓవర్లో వికెట్ కోల్పోయాడు. ఇక కేప్టెన్ రిషభ్ పంత్ కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు. అయితే మధ్య ఓవర్లలో నికోలస్ పూరన్ (44) మెరుగైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ (19), బదోని (41), అబ్దుల్ సమద్ (27) కీలక పరుగులు చేయడంతో లక్నో 171 పరుగుల వరకు చేరుకుంది.
172 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (61) విజృంభించి అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడు అయ్యర్, నేహాల్‌ల ధాటిగా ఆడడంతో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన స్థానం బలపరచుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది.