ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025(IPL 2025) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. 13 వేదికల్లో మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరనుంది.
మార్చి 22 నుంచి మే 18 వరకు లీగ్ మ్యాచ్‌లు.. మే 20 నుంచి 25 వరకు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు.. క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నాయి.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మార్చి23న ఆడనుంది. మార్చి 27న లక్నతో, మార్చి 30న ఢిల్లీ, ఏప్రిల్ 3న కోల్‌కతా, ఏప్రిల్ 6న గుజరాత్, 12, పంజాబ్, 17న ముంబయి, 23న ముంబయి, 25న చెన్నై, మే 2న గుజరాత్, 5న ఢిల్లీ, 10న కోల్‌కతా, 13న బెంగళూరు, మే 18న లక్నోతో తలపడనుంది.

