క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025(IPL 2025) టోర్నీ ప్రారంభ తేదీ ఖరారైంది. ఈమేరకు బీసీసీఐ(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక ప్రకటన చేశారు. మార్చి 23 నుంచి టోర్నీ ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుందన్నారు. ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే మొత్తం మ్యాచుల షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
- Advertisement -
ఇదిలా ఉంటే ఇటీవల ఐపీఎల్ 2025 టోర్నీ మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో భారత ఆటగాళ్లు అధిక ధరకు అమ్ముడుపోయారు. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ అత్యధికంగా రూ.27కోట్ల భారీ ధర పలికారు. పంత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ కేఎల్ రాహుల్, చాహల్ కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో వెచ్చించాయి.