యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్(IPL 2025) 18వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా బెంగళూరు వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(KKR vs RCB) మధ్య జరగనుంది. ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్‌గా చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ల నృత్యాలతో పాటు గాయకుల పాటలు వంటి షోలు నిర్వహణకు రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వర్షం కారణంగా స్టేడియం చిత్తడిగా మారడంతో మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు కూడా దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు దాదాపు 70 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇక వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే కేకేఆర్, ఆర్‌సీబీ జట్లకు చెరో పాయింట్‌ను కేటాయిస్తారు. ఎందుకంటే లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే అందుబాటులో లేదు. మ్యాచ్ రద్దు కావడం జట్లకు లాభం చేకూర్చవచ్చు లేదా నష్టం జరగవచ్చు. అది టోర్నీలో మిగతా జట్ల ఆటపై ఆధారపడి ఉంటుంది.