Saturday, May 3, 2025
HomeఆటIPL 2025: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఈ టీమ్‌లు ఔట్..!

IPL 2025: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఈ టీమ్‌లు ఔట్..!

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో ఫ్లేఆఫ్స్‌కు(Playoffs) వెళ్లే జట్లపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే అధికారికంగా రెండు జట్లు ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్నాయి. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించిన మొద‌టి జ‌ట్టుగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ఉండటం గ‌మ‌నార్హం. ఐదు సార్లు ఛాపింయన్‌గా నిలిచిన సీఎస్కే జట్టు ఈ సీజన్‌లో దారుణమైన ప్రదర్శన చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

- Advertisement -

ఇక గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిష్ర్క‌మించింది. ఈ సీజ‌న్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన పింక్ టీమ్ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోయి మూడింట్లో మాత్రమే గెలిచింది. నెట్‌ర‌న్‌రేట్ -0.780గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో కొన‌సాగుతోంది.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు కూడా వరుస ఓటములతో ప్లేఆఫ్స్‌కు దూరంగానే ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో ఇప్పటి వ‌ర‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు 10 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. ఆ జ‌ట్టు ఖాతాలో 9 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.271గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. మరి మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో పాటు మెరుగైన రన్‌రేట్ సాధిస్తేనే ఈ జట్లకు అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News