HomeఆటIPL- 2026: ఐపీఎల్- 19వ ఎడిషన్‌ షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన

IPL- 2026: ఐపీఎల్- 19వ ఎడిషన్‌ షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన

IPL 2026 First Schedule: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ను భారత్‌ కైవసం చేసుకోవడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ఇక, ఇప్పుడు అదే ఉత్సాహంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌- 2026 సీజన్‌లో తమ అభిమాన టీంలను గెలిపించేందుకు ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ సారి ఐపీఎల్‌ మ్యాచ్‌లు రెండు విడతల్లో జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు తొలి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-notices-to-governments-on-sc-st-reservations-creamy-layer/

ఐపీఎల్‌- 2026, 19 వ ఎడిషన్‌ టోర్నమెంట్ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను ఈ నెల‌ 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీ మార్చి 28 నుంచి మే 31 వరకు జరగనుంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా మొత్తం షెడ్యూల్‌ను బీసీసీఐ ఒకేసారి ప్రకటించడం లేదు. మ్యాచ్‌ల తేదీలు ఎన్నికలతో ఇబ్బంది లేకుండా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి తొలి 20 రోజుల షెడ్యూల్‌ను ఈ రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు సైకియా తెలిపారు. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. 

కాగా, ఐపీఎల్‌ షెడ్యూల్ ఇంకా పూర్తిగా ఖరారు కానప్పటికీ, పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ సన్నాహక శిబిరాలను ప్రారంభించాయి. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్..  ఈ సారి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలో ఈ నెల‌ 1 నుంచే నవలూర్‌లోని తమ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ప్రాక్టీస్ స్టార్ట్‌ చేసింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా నవీ ముంబైలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించి ప్రాక్టీస్‌ జోరు పెంచింది.

Also Read: https://teluguprabha.net/cinema-news/allu-arjun-financial-support-to-kakinada-vetlapalem-durga/

మరోవైపు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ సైతం తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్లు మొదలెట్టాయి. ఇక, రాజస్థాన్ రాయల్స్ ఈ నెల‌ 15 నుంచి జైపూర్‌లో, కోల్‌కతా నైట్ రైడర్స్ 18 నుంచి తమ క్యాంపులను ప్రారంభించనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇప్పటికే తమ సన్నాహక శిబిరాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News