IPL 2026 Auction date: ఐపీఎల్ 2026 వేలానికి టైం అసన్నమైంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, IPL 2026 మినీ-వేలం ఈ ఏడాది డిసెంబర్ 2025లో జరగబోతుంది. ఈ ఆక్షన్ డిసెంబరు 13-15 తేదీల మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ నవంబర్ 15, 2025 నాటికి తమ అట్టిపెట్టుకున్న మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాలి.
ఈసారి వేలం ఎక్కడ ఉండబోతుంది?
గత రెండు ఐపీఎల్ వేలం పాటలు విదేశాలలో జరిగాయి. ఐపీఎల్ 2023 వేలం దుబాయ్‌లోనూ, ఐపీఎల్ 2024 వేలం జెడ్డాలోనూ జరిగింది. అయితే, ఈసారి మినీ వేలం బీసీసీఐ భారతదేశంలోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ సారి మినీ వేలం దేశీయంగా లేదా విదేశాలలో జరుగుతుందా అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈసారి ఆ జట్లలో పెను మార్పులు..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వంటి జట్లు గత సీజన్‌లో దారుణమైన ప్రదర్శన చేశాయి. అందువల్ల రాబోయే సీజన్ లో తమ జట్లలో గణనీయమైన మార్పులు చేయాలని భావిస్తున్నాయి. సీఎస్కే నుంచి విడుదలైన ఆటగాళ్ల జాబితాలో దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కుర్రాన్, డెవాన్ కాన్వే వంటి వారు ఉన్నారు. అశ్విన్ రిటైర్మెంట్‌తో చెన్నై టీమ్ కు 9.75 కోట్ల రూపాయలు మిగిలాయి.
Also Read: Women’s World Cup: – ‘కంగారూ’లను దాటితేనే కప్పు!
రాజస్థాన్ రాయల్స్ టీమ్ వానిందు హసరంగా, మహీష్ తీక్షణ వంటి స్పిన్నర్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈసారి మినీ వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ అందరి దృష్టిని ఆకర్షించనున్నాడు. గాయం కారణంగా అతను మునుపటి వేలంలో పాల్గొనలేకపోయాడు. ఈసారి అతడి కోసం జట్లన్నీ పోటీపడి అవకాశం ఉంది.


