MI vs CSK IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ అంచనాలు తారుమారయ్యాయి. అటు బౌలింగ్‌లో అద్భుత పర్ఫామెన్స్‌తో ముంబై బ్యాటర్లను కట్టడి చేసి తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఇటు బ్యాటింగ్‌లో నిలకడగా ఆడుతూ లక్ష్య ఛేదనను ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో పూర్తి చేసింది. రుతురాజ్ గైక్వాడ్, కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీలతో చిదంబరం స్టేడియం హోరెత్తిపోయింది.

Also Read: https://teluguprabha.net/telangana/record-breaking-temperatures-for-this-season-due-to-summer/
ముందుగా బ్యాటింగ్‌కి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమాన్ ధీర్ 57(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించినా.. ర్యాన్ రికెల్టన్ 37(24 బంతుల్లో 5 సిక్సర్లు)తో మంచి ఇన్నింగ్స్ ఆడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో జట్టు స్కోరు 200 దాటలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్(21), హార్దిక్ పాండ్యా(18) మినహా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 3 వికెట్లతో ముంబైని దెబ్బ కొట్టాడు. నూర్ అహ్మద్ 2, రామకృష్ణ ఘోష్, జెమీ ఓవర్టన్ తలో వికెట్ తీశారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-clarified-four-issues-to-the-employee-unions/
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కేకి ఆరంభంలోనే సంజూ శాంసన్(11) వికెట్‌తో భారీ షాక్ తగిలినా.. తర్వాత క్రీజులో నిలదొక్కుకున్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 67 పరుగులు(నాటౌట్ 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఉర్విల్ పటేల్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గైక్వాడ్‌కి తోడుగా కార్తిక్ శర్మ 54(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి వరకూ పోరాడి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. హాఫ్ సెంచరీతో జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, ఘజన్‌ఫర్‌కి చెరో వికెట్ దక్కింది.

