GT vs CSK IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సూపర్ విక్టరీని నమోదు చేసింది. చెన్నైలోని ఎం.ఎ చిదంబర్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తుగా ఓడించింది. సాయి సుదర్శన్ అదరగొట్టే పర్ఫామెన్స్‌తో సీఎస్‌కే సవాల్ విసిరిన లక్ష్యాన్ని సులుభంగా ఛేదించింది.
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకోగా.. సీఎస్‌కే బ్యాటింగ్ దిగింది. ఓపెనర్లు క్రీజులోకి రాగనే గుజరాత్ బౌలర్లు పరుగుల కట్టడిలో విజయం సాధించారు. కగిసో రబాడ 3 వికెట్లు తీసి టాప్ ఆర్డర్‌ను పెవిలియన్ చేర్చాడు. సంజూ శాంసన్ (11), ఉర్విల్ పటేల్ (4), సర్ఫరాజ్ ఖాన్ (0) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడుతూ చివరి వరకూ పోరాడాడు. 60 బంతుల్లో 74(6 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. శివమ్ దూబే (22) పరుగులు చేశాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, మానవ్ సుతార్, సిరాజ్ తలో వికెట్ తీశారు.
Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-gujarat-titans-beat-csk-by-8-wickets/
స్వల్ప లక్ష్య ఛేదనకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే తడబడకుండా ఆడుతూ మ్యాచ్‌ను త్వరగా ముగించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ 87(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో), శుభ్‌మన్ గిల్(33) జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ పెవిలియన్ చేరాక.. జోస్ బట్లర్(39*)తో జయభేరి మోగించాడు. దీంతో గుజరాత్ 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సీఎస్‌కే బౌలర్లలో హుస్సేన్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. తాజా మ్యాచ్ ఫలితంతో సీఎస్‌కే ఆడిన 8 మ్యాచుల్లో 3 గెలుపొందగా, గుజరాత్ టైటాన్స్ 4 విజయాలు నమోదు చేసింది.

