HomeTop Stories⁠KKR vs GT: ఉత్కంఠ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు.. చిత్తుగా ఓడిన కోల్‌కతా

⁠KKR vs GT: ఉత్కంఠ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు.. చిత్తుగా ఓడిన కోల్‌కతా

KKR vs GT IPL 2026: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌తో కోల్‌కతాకీ మరో ఓటమీ తప్పలేదు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండా పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ చివరి స్థానంలో నిలిచింది. ఇక గుజరాత్‌ టైటాన్స్‌ ఆడిన ఆరు మ్యాచుల్లో తాజా గెలుపుతో మూడు విజయాలను ఖాతాలో వేసుకుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/registrations-stalled-across-the-state-due-to-technical-glitch/

ముందుగా టాస్‌ గెలిచిన కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఆరంభంలోనే జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ అజింక్యా రహానే డకౌట్‌ కాగా, అంగ్‌క్రిష్ రఘువంశీ (8), టిమ్ సీఫెర్ట్ (19) త్వరగానే పెవిలియన్‌ చేరారు. దీంతో టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమైంది. జట్టు కష్టాల్లో ఉండగా.. క్రీజులోకి వచ్చిన కామెరాన్ గ్రీన్ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. హాఫ్‌ సెంచరీతో ఆచితూచి ఆడిన కామెరాన్‌ 79 పరుగులు(55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. రోవ్‌మన్ పావెల్ (27), రమణ్‌ దీప్‌ సింగ్‌(17) పరుగులు చేశారు. ఫలితంగా కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ 3, మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ 2 వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/hansika-interesting-comments-on-allu-arjun-and-desamuduru-movie/

181 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఆరంభం నుంచే నిలకడగా ఆడారు. శుభ్‌మన్‌ గిల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. గిల్ 86(50 బంతుల్లో) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జోస్‌ బట్లర్‌(25), సాయి సుదర్శన్‌(26), గ్లెన్‌ ఫిలిప్స్‌(19), వాషింగ్టన్‌ సుందర్‌(13) పరుగులతో రాణించారు. దీంతో ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 2 వికెట్లు, రమణ్‌ దీప్‌ సింగ్‌, సునీల్‌ నరైన్‌, వైభవ్‌ అరోరా తలో వికెట్‌ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News