RCB vs GT IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో గుజరాత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఆర్సీబీని 158 పరుగులకే ఆలౌట్ చేసి ఆ లక్ష్యాన్ని ఇంకా 25 బంతులు ఉండగానే 4 వికెట్ల తేడాతో ఛేదించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. ఆర్సీబీని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. విరాట్ కోహ్లీ కేవలం 13 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులతో దూకుడుగా ఆడాడు. అయితే గుజరాత్ బౌలర్ల కట్టడితో బెథెల్(5) పరుగులకో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కోహ్లీ ఔట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ గాడి తప్పింది. దేవదత్ పడిక్కల్ 40(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒకవైపు నిలకడగా ఆడుతూ రన్స్ చేస్తున్నా.. మరోవైపు వికెట్ల పతనంతో ఆర్సీబీ స్కోరు దూకుడికి బ్రేక్ పడింది. కెప్టెన్ రజత్ పటీదార్(19) ఫర్వాలేదనిపించాడు.
Also Read: https://teluguprabha.net/telangana/rs-praveen-sensational-comments-phone-tapping-case/
జితేశ్ శర్మ (1), టిమ్ డేవిడ్ (9), కృనాల్ పాండ్యా (4) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. చివర్లో రొమారియో షెపర్డ్ (17), వెంకటేశ్ అయ్యర్ (12), భువనేశ్వర్ కుమార్(15 నాటౌట్)తో తమ వంతు కృషి చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 3 కీలక వికెట్లు, రషీద్ ఖాన్ 2, జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, రబాడలు చెరో వికెట్ పడగొట్టారు. దీంతో ఆర్సీబీ 19.2 ఓవర్లకే ఆలౌట్ అయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Also Read: https://teluguprabha.net/lifestyle/what-is-boy-kibble-the-simple-meal-taking-over-social-media/
156 పరగులు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 43(18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చెలరేగి ఆడాడు. అయితే సాయి సుదర్శన్(6) త్వరగానే పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ 39(19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ (8), వాషింగ్టన్ సుందర్ (12) కాస్త నిరాశపరిచినా.. రాహుల్ తెవాటియా (17 బంతుల్లో 27 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. జాసన్ హోల్డర్ (12), రషీద్ ఖాన్ (7 నాటౌట్) మంచి తోడ్పాడు అందించారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో రాణించగా, రొమారియో షెపర్డ్ 2 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్ ఫలితంగా ఆర్సీబీ ఆడిన 9 మ్యాచుల్లో 6 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఇక గుజరాత్ ఐదు విజయాలతో 5వ స్థానంలో ఉంది.

