KKR vs SRH IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా హోం గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ధాటికి 19 ఓవర్లకే కుప్పకూలిన సన్‌రైజర్స్ బ్యాటర్స్.. చాలా తక్కువ స్కోరునే ప్రత్యర్థి జట్టు ముందుంచారు. అటు బౌలింగ్‌లోనూ హైదరాబాద్ పేలవమైన ప్రదర్శనతో కేకేఆర్‌కు విజయాన్ని కట్టబెట్టింది.
ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి పవర్ ప్లే నుంచే భారీ షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. ట్రావిస్ హెడ్ 61(28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ, ఇషాన్ కిషన్ 42(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్స్ ఎవరూ రాణించలేదు. కేకేఆర్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోవడంతో 19 ఓవర్లకి ఎస్‌ఆర్‌హెచ్ 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, కార్తిక్ త్యాగి 2, వైభవ్ అరోరా, కామెరాన్ గ్రీన్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.
166 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన కేకేఆర్ జట్టు నిలకడగా ఆడుతూ వికెట్లు కోల్పోకుండా ఛేదనను త్వరగానే ముగించింది. అంగ్‌క్రిష్ రఘువంశీ 59(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ అజింక్యా రహానే 43(36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులతో ఏమాత్రం తడబడకుండా ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫిన్ అలెన్(29), రింకూ సింగ్(22 నాటౌట్) మంచి సహకారం అందించారు. దీంతో ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 9 మ్యాచులు ఆడిన కేకేఆర్.. వరుసగా ఆరు మ్యాచులు ఓడి ఆ తర్వాత హ్యాట్రిక్ గెలుపును సొంతం చేసుకుంది.

