HomeTop StoriesKKR vs PBKS: ఈడెన్‌ గార్డెన్స్‌లో వరుణుడి అంతరాయం.. ఇరు జట్లకూ చెరో పాయింట్

KKR vs PBKS: ఈడెన్‌ గార్డెన్స్‌లో వరుణుడి అంతరాయం.. ఇరు జట్లకూ చెరో పాయింట్

IPL 2026 KKR vs PBKS: ఐపీఎల్‌ 2026 సీజన్‌ 19 ప్రారంభమయ్యాక తొలిసారిగా మ్యాచ్‌ రద్దయింది. ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తలపడుతున్న నైట్‌ రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ ఆరంభమైన కాసేపటికే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. వరుణుడి ప్రభావం తగ్గుతుందని దాదాపు 3 గంటల పైన ఎదురుచూసినప్పటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/five-people-died-in-prakasam-district-due-to-thunderstorm/

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన పంజాబ్‌ కింగ్స్‌.. మూడో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సన్నద్ధమైంది. మరోవైపు రెండు వరుస ఓటములతో నిరాశలో ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఈ మ్యాచ్‌తో అయినా గెలుపును ఆరంభించాలని ఎదురుచూసింది. దీంతో రెండు జట్ల అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూడగా.. వరుణుడు నిరాశపరిచాడు. 

పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి దిగిన కేకేఆర్‌.. వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ఒకే ఓవర్‌లో ఫిన్ అలెన్ (6), కామెరాన్ గ్రీన్ (4) వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. క్రీజులో అజింక్య రహానే (8*), అంగ్‌క్రిష్ రఘువంశీ (7*) ఉండగా.. వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇంకా వాన కురుస్తుండటంతో రాత్రి 11 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఇరు జట్లకూ చెరో పాయింట్‌ కేటాయించింది. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/google-data-center-in-ap-with-huge-investment-of-15-billion-dollars/

ఈ పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్‌ల్లో 5 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక కేకేఆర్ ఈ మ్యాచ్ ద్వారా ఈ సీజన్‌లో తమ మొదటి పాయింట్‌ను సాధించి, 8వ స్థానానికి చేరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News