RR vs KKR IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ 19లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి గెలుపు నమోదు చేసింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కేకేఆర్.. ఎట్టకేలకు బోణీ కొట్టింది. సీనియర్ క్రికెటర్లను సైతం తన బ్యాటింగ్ పవర్‌తో గడగడలాడించిన వైభవ్ సూర్యవంశీకి మరో షాక్ ఇస్తూ రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో అజింక్యా రహానే సేన 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
Also Read: https://teluguprabha.net/national-news/explosion-in-fireworks-factory-in-tamilnadu-18-died/
తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్‌కతా బౌలింగ్‌కి దిగింది. ఇప్పటివరకూ ప్రతి మ్యాచులో 200 పైన స్కోరు చేసి ఛేజింగ్ టీమ్‌కి గట్టి సవాల్ విసిరిన ఆర్‌ఆర్‌ని ఈ సారి కేకేఆర్ గట్టిగా దెబ్బకొట్టింది. పొదుపైన బౌలింగ్‌తో పరుగుల కట్టడి చేస్తూ వరుసగా వికెట్లు పడగొట్టింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.. 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (39), వైభవ్ సూర్యవంశీ (46) అద్భుత ఆరంభాన్ని ఇచ్చినా.. మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. షిమ్రాన్ హిట్‌మెయిర్ 15 పరుగులు, రియాన్ పరాగ్ 12 రన్స్ చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, కార్తీక్ త్యాగి 3, సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టారు.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/hail-rain-fell-in-hyderabad/
156 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. టార్గెట్‌ను ఛేదించేందుకు చివరి వరకూ పోరాడాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కీలక వికెట్లు కోల్పోయినా.. తర్వాత క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు నాటౌట్), అనుకుల్ రాయ్(16 బంతుల్లో 29 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు), కామెరాన్ గ్రీన్(13 బంతుల్లో 27 పరుగులు- 4 ఫోర్లు, ఒక సిక్సర్) దూకుడుగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. రోవ్‌మెన్ పావెల్ 23, రఘువంసీ 10, రమణ్ దీప్ సింగ్ 10 పరుగులు చేశారు. దీంతో ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్‌ఆర్ బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. నాంద్రే బర్గర్, యష్ చెరో వికెట్ తీశారు.

