HomeTop StoriesLSG vs KKR: ఓటమి అంచు నుంచి గెలుపు తీరాలకు.. దుమ్ములేపిన ముకుల్‌.. లక్నో ఘన...

LSG vs KKR: ఓటమి అంచు నుంచి గెలుపు తీరాలకు.. దుమ్ములేపిన ముకుల్‌.. లక్నో ఘన విజయం

IPL 2026 LSG vs KKR: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బాల్‌ వరకు సాగిన హోరాహోరీ మ్యాచ్‌లో లక్నో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ముకుల్‌ చౌదరి 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 14 బంతులు అవసరమవగా.. ముకుల్‌ 2 భారీ సిక్సులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-says-land-records-with-the-strongest-security-possible-using-blockchain-technology/

టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్న LSG కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌.. కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అజింక్యా రహానే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రహానే 24 బంతుల్లో 41 పరుగులు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రఘు వంశీ 33 బంతుల్లో 45 రన్స్‌ చేశాడు. రొవ్‌మెన్‌ పావెల్‌(39), కామెరూన్‌ గ్రీన్‌(32) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌, మణిమారన్‌ సిద్దార్థ్‌, దిగ్వేశ్‌ రాఠీ, అవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

Also Read: https://teluguprabha.net/telangana/dgp-shivadhar-reddy-writes-a-letter-to-the-police-on-corruption/

182 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన లక్నో టీం.. టార్గెట్‌ను ఛేదించేందుకు చివరి వరకూ పోరాడాల్సి వచ్చింది. ముకుల్‌ చౌదరి 54(27 బంతుల్లో), ఆయూశ్‌ బదోని(54) పరుగులతో రాణించగా.. రిషబ్‌ పంత్‌(10), నికోలస్‌ పూరన్‌(13), మార్‌క్రమ్‌(22), మిచెల్‌ మార్ష్‌(15) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో అనుకుల్‌ రాయ్, వైభవ్‌ అరోరా చెరో 2 వికెట్లు తీశారు. కామెరూన్‌ గ్రీన్‌, కార్తీక్‌ త్యాగి చెరో వికెట్‌ పడగొట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News